యాప్నగరం

సైకిల్‌పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం.. స్పీడ్ పెంచిన చంద్రబాబు

TDP: ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత.. ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఊహించని విజయాలతో.. టీడీపీ మంచి జోష్‌లో ఉంది. ఇదే ఊపులో.. 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో.. పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని టీడీపీ కీలక నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సైకిల్‌పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం.. అంటూ మాస్ డైలాగ్‌లు పేల్చారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 25 Mar 2023, 12:32 am

ప్రధానాంశాలు:

  • ఊహించని విజయాలతో టీడీపీలో జోష్
  • అడ్డొస్తే తొక్కుకొని వెళ్తామంటున్న చంద్రబాబు
  • పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని ఆశాభావం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chandrababu Naidu
చంద్రబాబు నాయుడు
TDP: తెలుగుదేశం పార్టీ బలపడింది కాబట్టి.. నవంబర్ లేదా డిసెంబర్‌లో జగన్ ఎన్నికలకు వెళ్లొచ్చని.. ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన టీడీపీ జోన్‌- 3 సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలకే జగన్‌పై నమ్మకం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టభద్రుల్లో తిరుగుబాటు వచ్చిందని.. దాని ఫలితమే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని Chandrababu Naidu వివరించారు.
'ఇక నుంచి తెలుగుదేశం పార్టీ.. అన్‌స్టాపబుల్‌. గేర్‌ మార్చి.. స్పీడ్‌ పెంచుతాం. సైకిల్‌ పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం. జగన్ చేసిన విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అప్పులు చేయడం.. దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ మరిన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జగన్‌ది ధన బలమైతే.. మనది జన బలం. పేదలను దోచుకున్న జగన్.. పేదల ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తి కంటే.. జగన్ ఆస్తి ఎక్కువ' అని చంద్రబాబు ఆరోపించారు.

'వచ్చే ఎన్నికల్లో మనం అధికారంలోకి రావడం ఖాయం. కష్టపడ్డ కార్యకర్తలను వెతుక్కుంటూ పార్టీనే వాళ్ల వద్దకు వస్తుంది. మన ప్రభుత్వంలో పైరవీలు ఉండవు. పార్టీ కోసం పనిచేసే వారే నా ఆప్తులు. వారికే ప్రాధాన్యత ఇస్తా. రాష్ట్రాన్ని బాగుచేయడం ఎంత ముఖ్యమో.. తెలుగుదేశం కుటుంబ సభ్యులను బాగుచేయడం అంతే ముఖ్యం. గతంలో కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన మాట వాస్తవం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉండిపోయాను. ఈ సారి కార్యకర్తలకే పెద్ద పీట వేస్తా. ఎన్ని పనులున్నా కార్యకర్తలే ముఖ్యం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.


'ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి. కార్యకర్తలు యాక్టివ్‌ గా ఉండాలి. అధికారం లోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిని నియమిస్తాం. గ్రామ స్థాయి లో సమస్యలను పరిష్కరిస్తాం. సంతలో పశువుల మాదిరిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ కు ఇదే చివరి సారి కావాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మళ్లీ మోసపోతాం. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలి. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలి' అని చంద్రబాబు సూచించారు.


Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.