యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల. ఏపీలో మూడు స్థానాలు, తెలంగాణలో ఒక్క స్థానానికి ఎన్నికలు. ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల సంఘం.

Samayam Telugu 1 Aug 2019, 7:02 pm
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో మూడు, తెలంగాణలో ఒక స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 7న దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ నెల 14 వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరు కాగా.. 16న నామినేషన్ల పరిశీలన, 19 వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. 26న ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు.
Samayam Telugu ceo


ఏపీలో మూడు స్థానాల విషయానికి వస్తే.. టీడీపీ నుంచి కరణం బలరాం.. వైసీపీ నుంచి ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్ర స్వామిలు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఈ ముగ్గురూ సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంతో.. ఈ మూడు స్థానాలకు ఖాళీలు వచ్చాయి. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్న యాదవరెడ్డి పార్టీ ఫిరాయించడంతో అనర్హత వేటు పడింది. దీంతో ఒక స్థానానికి ఖాళీ ఏర్పడింది. మొత్తం ఈ నాలుగు స్థానాలకు కలిపి షెడ్యూల్ వచ్చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.