యాప్నగరం

పెళ్లి కోసం జోతిష్యుడి మాట విని.. ఆంధ్రా మొత్తం వివాదం రేపిన అన్నదమ్ములు.. శ్రీకాళహస్తి ఆలయంలో జరిగింది ఇదే!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రీకాళహస్తి కేసులో అసలేం జరిగిందో పోలీసులు నిగ్గుతేల్చారు.

Samayam Telugu 23 Sep 2020, 2:30 pm
Samayam Telugu శ్రీకాళహస్తి కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రమేష్ రెడ్డి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఈ నెల 11వ తేదీన నిబంధనలకు విరుద్ధంగా శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. అంతర్వేది ఘటన జరిగిన వెంటనే ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో మరింత వివాదాస్పదమైంది. రాష్ట్రంలోని హిందూ సంఘాలు, బీజేపీ, టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఈ తరుణంలో ప్రధాన అర్చకుడితో పాటు ఆలయ అధికారులపై ఈవో సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం విదితమే. అయితే ఆ విగ్రహాలు అక్కడికి ఎలా వచ్చాయనే దానిపై సస్పెన్స్ వీడిండి. పెళ్లి కోసం, ఇతర వ్యక్తిగత విషయాల్లో ఇబ్బందులు తొలగించుకునేందుకు ఓ జోతిష్యుడు చెప్పిన మాట విని ముగ్గురు అన్నదమ్ములు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

Also Read: నువ్వు హిందువా.. చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

పెళ్లి కావట్లేదని.. జోతిష్యుడి మాట విని!
విగ్రహాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. లోతుగా విచారణ జరిపిన పోలీసులు దేవాలయంలో అనధికార విగ్రహాలు పెట్టిన నిందితులను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన సులవర్ధన్, తిరుమలయ్య, ముని శేఖర్ అనే ముగ్గురు అన్నదమ్ములను అరెస్ట్ చేసిట్లు పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. వీరిని పోలీసులు లోతుగా విచారించగా.. అసలు విషయం బయటపడింది. తిరుమలయ్య, మునిశేఖర్ చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. అలాగే 30 ఏళ్లు దాటినా ముగ్గురు అన్నదమ్ములకు వివాహం కాకపోవడం, ఆర్థిక సమస్యలు ముంచెత్తడంతో జ్యోతిష్యులను సంప్రదించారు. ఈ ఇబ్బందులను అధిగమించడం కోసం జ్యోతిష్యుల సూచన మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో విగ్రహాలు ప్రతిష్టించాలని ముగ్గురు అన్నదమ్ములు నిర్ణయించారు. ఈ క్రమంలోశ్రీకాళహస్తి ఆలయంలో శివలింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించారు.

తిరుపతిలో ఈ నెల 2వ తేదీన విగ్రహాలు చేయించి, ఈ నెల 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో పోలీసులు తేల్చారు. సీసీటీవీ విజువల్స్, ద్విచక్రవాహనాల నెంబర్లు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ ఫోన్‌లు సీజ్ చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

Must Read: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ ఒక్క జిల్లాలోనే దాదాపు 90 వేలు.. ఊరట కలిస్తున్న డిశ్చార్జిలు

Don't Miss: దర్శకుడు కొరటాల శివ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం.. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోలు పోసుకుని..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.