యాప్నగరం

ఇళ్ల పట్టాల వివాదం.. ఎమ్మార్వో ఆఫీసు పై నుంచి దూకేసిన మహిళా గ్రామ వలంటీర్..

చిత్తూరు జిల్లాలో మహిళా గ్రామ వలంటీర్ ఎమ్మార్వో ఆఫీసు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు.

Samayam Telugu 1 Jul 2020, 5:52 pm
ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకల కారణంగా ఓ మహిళా గ్రామ వలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. తస్‌ పున్నీసా అనే గ్రామ వలంటీర్ ఎమ్మార్వో ఆఫీసుపై నుంచి దూకారు. తీవ్ర గాయాల పాలైన ఆమెను స్థానికులు బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu గ్రామ వలంటీర్ ఆత్మహత్యాయత్నం


కాగా, బాధితురాలు తస్‌ పున్సీసా బి.కొత్తకోట బీసీ కాలనీలో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇళ్ల స్థలాల జాబితాలో అర్హులైన వారికి స్థలాలు ఎందుకు కేటాయించలేదని ఆమె అధికారులను ప్రశ్నించింది. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడం, ఇటు లబ్ధిదారులు ప్రశ్నిస్తుండటంతో మనస్తాపానికి గురైన గ్రామ వలంటీర్ ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబీకులు చెబుతున్నారు.

కాగా, వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.