యాప్నగరం

నంద్యాల సలాం ఫ్యామిలీ హత్యకేసు.. అరెస్టైన సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు బెయిల్

ఆటో డ్రైవర్ అబ్ధుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా.. సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

Samayam Telugu 9 Nov 2020, 4:30 pm
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఆటోడ్రైవర్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టైన సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు కోర్టు రిమాండ్ విధించింది. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌కు నంద్యాల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడు రోజుల రిమాండ్ వేసింది. ఆ వెంటనే సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా జిల్లా కోర్టు మంజూరు చేసింది.
Samayam Telugu సీఐ సోమశేఖర్ రెడ్డి


నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్ధుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా.. సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. దొంగతనం చేయకపోయినా పోలీసులు వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియ్‌స్‌గా తీసుకుంది. ఐజీ శంకబ్రత బాగ్చి, గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌లతో ప్రాథమిక విచారణ చేయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.