యాప్నగరం

‘వైఎస్ జగన్ అనే నేను.. ప్రజల సాక్షిగా మరోసారి ప్రమాణం చేస్తున్నా.. ఇదే నా విజన్’

వైసీసీ సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ‘వైఎస్‌ జగన్‌ అనే నేను’ అంటూ ముఖ్యమంత్రి మరోసారి ప్రమాణం చేసి.. ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తున్నానని తెలిపారు.

Samayam Telugu 30 May 2020, 2:49 pm
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కేంద్రాలను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ‘వైఎస్‌ జగన్‌ అనే నేను’ అంటూ మరోసారి ప్రమాణం చేసి.. ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తున్నానని తెలిపారు.
Samayam Telugu వైఎస్ జగన్


‘‘వైఎస్ జగన్‌ అనే నేను 6 కోట్ల మంది ఆంధ్రులకు ఇచ్చిన మాటను తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నానని మరోసారి ప్రమాణం చేస్తున్నా. మీరిచ్చిన అధికారాన్ని ఉపయోగించి ఈ 6 కోట్ల మంది ఏపీ ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నాను. వైఎస్ జగన్ అనే నేను ఏడాది కాలంగా.. మీ కుటుంబ సభ్యుడిగా, మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నానని దైవ సాక్షిగా, ప్రజల సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నా.’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

అలాగే పార్టీ మేనిఫెస్టోనే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా భావిస్తూ ఈ సంవత్సర కాలంగా పాలన సాగించామని సీఎం జగన్ వెల్లడించారు. ‘‘ఈ రోజు కనిపించే మేనిఫెస్టో.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సెక్రటేరియట్‌లో ఉన్న ప్రతి సెక్రటరీ, మంత్రుల దగ్గర.. వారి కార్యాలయాల్లో కనిపిస్తుంది. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గరా ఈ మేనిఫెస్టో కనిపిస్తుంది. ఈ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా నేనెలా భావిస్తున్నానో.. అధికార యంత్రాంగం, ప్రభుత్వం మొత్తం అలాగే భావించి ఈ ఏడాది పరిపాలన సాగించాం.’’ అని సీఎం జగన్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.