యాప్నగరం

AP Lockdown: సీఎం జగన్ సంచలన ప్రకటన

YS Jagan: ఏపీని మార్చి 31 వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. బోర్డర్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు.

Samayam Telugu 23 Mar 2020, 8:52 am
దేశం మొత్తం మీద కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ను లాక్ డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. లాక్ డౌన్ అంటే రాష్ట్రానికి సంబంధించిన అన్ని బోర్డర్స్‌ను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. దేశం మొత్తం లాక్ డౌన్ అయితేనే పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి ఉందన్నారు. ఏపీ నుంచి వేరే ప్రాంతాలకు గాని, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి రాకపోకలను పూర్తిగా నిలిపిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఇప్పటికే మూసివేశామని, ఇది ఈ నెల 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Samayam Telugu 8


పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని సీఎం జగన్ వెల్లడించారు. అయితే పరీక్షలు రాసేటప్పుడు రాసేటప్పుడు రెండు మీటర్ల డిస్టెన్స్ పాటించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్స్, అన్ని ఈ నెల 31 వరకు మూసివేస్తామని చెప్పారు.

పెద్ద గుడులన్నింటిలో దర్శనాలపై పరిమితి విధిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద ఈ నెల 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 3 జిల్లాలను లాక్ డౌన్ చేస్తున్నట్లు తెలిపిన నేపథ్యంలో సీఎం జగన్ మొత్తం రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Must Read: బోర్డర్లన్నీ మూసివేత, అంతా ఇంట్లోనే.. ప్రతి ఇంటికి రూ. వెయ్యి.. సీఎం జగన్ సంచలన నిర్ణయాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.