యాప్నగరం

సీఎం జగన్‌తో సాయిరెడ్డి, మంత్రులు భేటీ.. ఢిల్లీ టూర్ వాయిదా పడ్డ కొద్దిసేపటికే..

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిద పడ్డ తరుణంలో వైసీపీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

Samayam Telugu 2 Jun 2020, 3:30 pm
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. సీఎం జగన్ ఢిల్లీ టూర్ రద్దు కాగానే మంత్రులు ఆయన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Samayam Telugu సీఎం జగన్, విజయసాయి


సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులతో పాటు ఎన్నికల కమిషనర్, ఢిల్లీ టూర్ రద్దు అయిన వ్యవహారంపై కూడా కీలకంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మంగళవారం ఉన్నట్లుండి వాయిదా పడింది. హస్తినకు బయల్దేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆగిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా సమావేశాలతో బిజీగా ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే హస్తినకు వెళతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ 10.30కు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అక్కడ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌, కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ ఖరారైంది. రాత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. కానీ చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.