యాప్నగరం

నా బలం వీరే.. నమ్మకం, విశ్వాసం వారిపైనే.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్పందన, లాక్ డౌన్ 4.0పై కీలక సూచనలు చేశారు.

Samayam Telugu 19 May 2020, 2:35 pm
స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన బలం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలేనని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న కలెక్టర్లు, ఎస్పీలందరూ ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించినట్లు తెలిపారు. తన పూర్తి నమ్మకం, విశ్వాసం వారిపైనే పెట్టానని, అందుకే వారే నా బలమని చెప్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమర్థంగా పని చేస్తే ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్లేనని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Samayam Telugu సీఎం జగన్


కరోనా వైరస్‌ నివారణలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అద్భుతంగా పనిచేశారని సీఎం జగన్ ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో గ్రామ వలంటీర్లు, సచివాలయం, ఆశావర్కర్లు, ఏఎస్‌లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అంతా అద్భుతంగా పని చేశారన్నారు. మనం ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లోకి అడుగుపెట్టామని, ఇంతకు ముందు మనం అనుసరించిన పద్దతి వేరు.. నాలుగో విడత లాక్‌డౌన్‌లో అనుసరిస్తున్న పద్ధతి వేరని చెప్పారు.

ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. కోవిడ్‌ 19 నివారణపై మన దృష్టి పోకుండానే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.