యాప్నగరం

సీఎస్ నీలం సాహ్ని కోసం.. కేంద్రానికి లేఖ రాసిన సీఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కోసం సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మరో ఆరు నెలలు ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలని కోరారు.

Samayam Telugu 13 May 2020, 6:31 pm
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీన సీఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ ఆమె పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు.
Samayam Telugu సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్ని


సీఎస్‌గా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించి 6 నెలలే కావడంతో పదవీ కాలాన్ని పొడిగించాలని సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కరోనా విపత్తు సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులకు పదవీ కాలాన్ని మూడు నెలల వరకు కేంద్రం పొడిగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలకమైన స్థానంలో ఉన్న సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని సైతం మరో 6 నెలలు పొడిగించాలని సీఎం జగన్ కోరినట్లు తెలుస్తోంది.

కాగా, అనూహ్య పరిణామాల మధ్య నీలం సాహ్నిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎస్‌గా నియమించారు. దీంతో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మహిళా సీఎస్‌గా నీలం సాహ్ని రికార్డు సృష్టించారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం అనేక పదవులు అధిరోహించి రాష్ట్రంలో అత్యున్నత పదవైన సీఎస్‌గా 2019 నవంబర్‌లో నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.