యాప్నగరం

తలో దిక్కున కూర్చున్న సీఎం జగన్, చంద్రబాబు.. ఎట్ హోంలో ఆసక్తికర పరిణామాలు

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. అయితే, వీరిద్దరూ ఎదురెదురు పడలేదు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 15 Aug 2022, 8:48 pm
Samayam Telugu ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, గవర్నర్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎట్ హోం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి హాజరయ్యారు. అలాగే, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

అలాగే, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఆహ్వానం అందినప్పటికీ ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కాగా, ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన అతిథులందర్నీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరు పేరున పలకరించారు. తానే స్వయంగా అతిథులు కూర్చున్న టేబుళ్ల దగ్గరకు వెళ్లి పలకరించారు.

తర్వాత జాతీయ గీతాలాపనతో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ హాజరైనా ఒకరికొకరు ఎదురుపడలేదు. ప్రధాన టేబుల్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు, గవర్నర్ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా దంపతులు కూర్చున్నారు. వేదిక ఎడమ వైపున టేబుల్ వద్ద చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని, అశోక్‌బాబు కూర్చున్నారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.