యాప్నగరం

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంపై సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో భారీ స్కామ్ జరిగిందన్నారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 24 May 2023, 12:34 am
ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ విషయంలో గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అవినీతిమయమయ్యాయని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సొమ్ము రూ. 371 కోట్లు దోచుకున్నారని ఫైరయ్యారు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు.
Samayam Telugu సీఎం జగన్ (ఫైల్ ఫొటో)


నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో స్కిల్‌ డెవలప్‌మెంట్ కాలేజీలు, ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో మంచి వ్యవస్థలు ఏర్పడతాయని వెల్లడించారు. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కాగా, దేశచరిత్రలోనే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ అతి పెద్దదని గతంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోందన్నారు. ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్‌ అని చెప్పుకొచ్చారు. విదేశీ లాటరీ తరహాలోనే ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ను నడిపించారని ఆరోపించారు. దీంతో రూ. 371 కోట్ల జనం సొమ్మును మాయం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కీమ్‌ ఖర్చు మొత్తం రూ. 3,356 కోట్లు అని తెలిపారు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం కాగా, 90 శాతం సీమెన్స్ కంపెనీ భరిస్తుందని చెప్పారన్నారు. అయితే, ఎక్కడైనా ప్రైవేటు కంపెనీ రూ. 3 వేల కోట్లు గ్రాంట్‌గా ఇస్తుందా అని ప్రశ్నించారు. ఇదే విషయంలో గతంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబును సీఎం జగన్‌ నిలదీసిన విషయం విదితమే.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.