యాప్నగరం

అసోం ముఖ్యమంత్రికి సీఎం జగన్ ఫోన్.. ఆ లారీలు ఆపొద్దంటూ..

YS Jagan Mohan Reddy: అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ నుంచి వచ్చే చేపల లారీలను ఆపొద్దని విజ్ఞప్తి చేశారు.

Samayam Telugu 18 Apr 2020, 6:28 pm
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అసోం సీఎం శర్బానంద సోనోవాల్‌ ఫోన్ చేశారు. అసోం సరిహద్దుల్లో ఏపీకి చెందిన లారీలు నిలిపివేయకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతాయని సీఎం జగన్ గుర్తు చేశారు. దీంతో చేపల ఎగుమతికి ఉన్న అడ్డంకుల తొలగింపుపై దృష్టి పెట్టాలని అసోం ముఖ్యమంత్రిని కోరారు. అలాగే చేపలు విక్రయించే మార్కెట్లను తెరవాలంటూ విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu pjimage - 2020-04-18T182806.978


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వినతికి అసోం సీఎం శర్బానంద సోనోవాల్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు తగిన సహాయాన్ని అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ను అసోం ముఖ్యమంత్రి సోనోవాల్ కోరారు. దీంతో ఏపీలోని అసోం వాసులకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని అసోం సీఎంకు వైఎస్‌ జగన్‌ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.