యాప్నగరం

కాపులు బీసీలా? ఓసీలా? అప్పట్లో అయోమయం.. సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్

కాపు నేస్తం రెండో ఏడాది నిధులు విడుదల చేశారు సీఎం జగన్. 490 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లతో కాపులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

Samayam Telugu 22 Jul 2021, 5:38 pm
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కాపు మహిళలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో చేపట్టిన కాపు నేస్తం పథకాన్ని రెండో ఏడాది దిగ్విజయంగా అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు కాపు నేస్తం నిధులు విడుదల చేశారు. సీఎం జగన్ వర్చువల్ విధానంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ చేశారు. కాపు నేస్తం విడుదల సందర్భంగా అనంతరం సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kapu nestam


గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులు బీసీలా? ఓసీలా? అనే అయోమయానికి గురిచేశారని జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే న్యాయ వివాదాలు సృష్టించిందని విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో అగ్రవర్ణ పేదలకు న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోయిందని.. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. కాపులకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలవుతాయని.. రిజర్వేషన్లతో కాపులకు మేలు జరుగుతుందని జగన్ అన్నారు. నిధుల విడుదల సందర్భంగా కాపు నేతలు సీఎం జగన్‌కు అభినందనలు తెలియజేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.