యాప్నగరం

'తండ్రి వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌కు.. సీఎం జగన్ అడ్డు'

ఆనాడు దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్టను ప్రారంభిస్తే.. ఇప్పుడు కుమారుడు వైఎస్ జగన్ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారుతున్నారు. ప్రభుత్వం పద్దతి మార్చుకోకపోతే ప్రాజెక్టు ఆలస్యమవుతుంది.

Samayam Telugu 3 Aug 2019, 2:38 pm
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన తుగ్లక్‌ను తలపిస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి. వైసీపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రకృతి ఆంధ్రప్రదేశ్‌కు ప్రసాదించిన ఓ వరమని.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌ పూర్తికాకుండా సీఎం జగన్ అడ్డుపడుతున్నారని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన తులసిరెడ్డి.. జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
Samayam Telugu 679


పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు తులసి రెడ్డి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇదే విషయాన్ని పార్లెమెంట్ సాక్షిగా ప్రస్తావించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోవడంతో ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పోలవరం బాధ్యతను ఏపీ ప్రభుత్వంపై నెట్టేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కాసుల కోసం ప్రాజెక్ట్ బాధ్యతను తీసుకున్నారని విమర్శించారు.

విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం కేంద్రం పోలవరం ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకోవాలని డిమాంండ్ చేశారు తులసిరెడ్డి. నిర్వాసితులందరికి న్యాయం చేయాలని.. రూ. 4వేల554 కోట్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలతో ప్రాజెక్ట్ మరింత ఆలస్యమవుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని పోలవరం ఆలస్యం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.