యాప్నగరం

ఏపీ మంత్రులు బొత్స, అవంతిలకు కార్మికుల షాక్

విశాఖలో మంత్రి అవంతి ఇంటిని ముట్టడించిన జనసేన కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు. గుంటూరులో మంత్రి బొత్స సత్యనారాయణను అడ్డుకున్న కార్మికులు.. పనులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన.

Samayam Telugu 26 Oct 2019, 12:01 pm
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గుంటూరులో పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ పనుల్ని మరో మంత్రి మోపిదేవి, స్థానిక ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి పరిశీలించారు. డ్రైనేజీ పనులు అగిపోవడంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గుంటూరులోని బీఆర్ స్టేడియం, పొన్నూరు రోడ్డులో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. భూగర్భ డ్రైనేజీ పనులు మూడేళ్ల క్రితం మొదలయ్యాయని.. పనులు సక్రమంగా జరగలేదన్నారు బొత్స. ఈ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు మంత్రి.
Samayam Telugu avanthi.


Read Also: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్

ఇదిలా ఉంటే గుంటూరులో పర్యటిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణను భవన నిర్మాణ కార్మికులు ఎదురయ్యారు. తమ సమస్యల్ని చెప్పుకొని మంత్రిని నిలదీశారు. ఇసుక కొరతతో పనులు లేక ఇబ్బంది పడుతున్నామని.. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించింది ఇందకేనా అంటూ ప్రశ్నించారు. దీంతో మంత్రి వారికి సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పడంతో వారు కాస్త శాంతించారు.

ఇటు విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కూడా నిరసన సెగ తగలింది. ఆయన ఇంటిని జనసేన నేతలు, భవన నిర్మాణ కార్మికులు ముట్టడించారు. ఇసుక కొరతతో పనులు లేవని.. తమకు ఉపాధి కల్పించాలని, ఇసుకను అందుబాటులోకి తేవాలని నినాదాలు చేశారు. కార్మికులు మంత్రిని కలిసి తమ సమస్యల్ని చెప్పుకున్నారు. త్వరలోనే ఇసుకను అందుబాటులోకి వస్తుందని కార్మికులకు సర్థిచెప్పారు. దీనిపై కొన్ని పార్టీలు అనవసరంగా రాద్దాం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.