యాప్నగరం

గుంటూరు: ఆస్పత్రి నుంచి కరోనా అనుమానితుడు పరారీ

Coronavirus Cases in Andhra Pradesh: గుంటూరు జీజీహెచ్ నుంచి పరారైన కరోనా అనుమానితుడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆస్పత్రి ఆర్‌ఎంవో.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అతడి వివరాలపై ఆరా.

Samayam Telugu 30 Mar 2020, 10:52 am
గుంటూరు జీజీహెచ్ నుంచి కరోనా అనుమానితుడు పరారీ కావడం కలకలంరేగింది. కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో ఈనెల 25న గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. ఆస్పత్రి డాక్టర్లు ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పరీక్షిస్తున్నారు. అతను గురువారం ఆస్పత్రి నుంచి పారిపోయాడని జీజీహెచ్‌ ఆర్‌ఎంవో ఆదినారాయణ చెబుతున్నారు. ఆర్‌ఎంవో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా అనుమానితుడు పారిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతుండగా.. అతడి వివరాలపై ఆరా తీస్తున్నారు.
Samayam Telugu ggh


ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 12కు చేరాయి. వీటిలో గుంటూరులో ఒకటి.. పొరుగునే ఉన్న విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. పలువురు అనుమానితుల్ని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. అలాగే గుంటూరులో పాజిటివ్ కేసు నమోదు కావడంతో కొన్ని కాలనీలను రెడ్ జోన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అరుంధతి నగర్, నెహ్రూ నగర్, ఆర్టీసీ కాలనీ, మంగళదాస్ నగర్, అంబేద్కర్ నగర్, సీతా నగర్, వాసవి నగర్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో శానిటేషన్ చేశారు.

మరోవైపు వార్డు వాలంటీర్ల సాయంతో నగరంలో ప్రతి కుటుంబానికి సంబంధించితన హెల్త్ రిపోర్ట్‌ను నమోదు చేస్తున్నారు. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ వచ్చి ఉంటే.. వారి ఆరోగ్య పరిస్థితి.. హోమ్ క్వారంటైన్‌ వివరాలను సేకరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.