యాప్నగరం

భవిష్యత్తులో అందరికీ కరోనా, ఎవ్వరూ ఆపలేరు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

AP Coronavirus: కరోనా ఉందని తెలిసిన వెంటనే ఎవరికి ఫోన్‌ చేయాలి? వైద్యం ఎలా పొందాలి అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లకు సూచించారు.

Samayam Telugu 16 Jul 2020, 10:59 pm
భవిష్యత్‌లో కరోనా సోకని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరేమోనని ఏపీ సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. జ్వరం వచ్చినట్లే అందరికీ కరోనా కూడా సంక్రమిస్తుందని వ్యాఖ్యానించారు. ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ కొత్త సేవల విస్తరణ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో జగన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్లకు పలు సూచనలు చేస్తూ సీఎం జగన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు దానితో సహజీవనం చేయాల్సిందేనని మరోసారి అన్నారు.
Samayam Telugu వైఎస్ జగన్
Jagan


అయితే, కరోనా సోకిన వెంటనే ఏం చేయాలనే అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. కరోనా ఉందని తెలిసిన వెంటనే ఎవరికి ఫోన్‌ చేయాలి? వైద్యం ఎలా పొందాలి అనే దానిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీకి ఆనుకొని ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులు తెరిచినందున రాకపోకలు పెరుగుతాయని, దీంతో కరోనా కేసులు కూడా పెరుగుతాయని తెలిపారు. ఇకపై కరోనా సంక్రమించడాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి బయటపడొచ్చని సీఎం తెలిపారు.

ప్రస్తుతం కరోనా బారిన పడ్డవారిలో చాలా మంది ఇంటి వద్ద ఉండి వ్యాధిని నయం చేసుకోవచ్చని జగన్ అన్నారు. తక్కువ సంఖ్యలో మాత్రమే ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని, మొత్తం రోగుల్లో కేవలం 4 శాతం మాత్రమే ఐసీయూల్లో ఉంటున్నారని సీఎం గుర్తు చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనా సంక్రమణను ఎవరూ ఆపలేరని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.