యాప్నగరం

చంద్రబాబు జైలుకెళ్తే ఆయనకే మంచిది.. జగన్ సీఎం అయింది అందుకే.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 30 Sep 2020, 4:14 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును ఉద్దేశించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ జైలుకు వెళ్లడం వల్లే ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ, రైతు చట్టాలకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీపీఐ నేత నారాయణ కేంద్రంపై మాత్రమే కాక, రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలపై మండిపడ్డారు.
Samayam Telugu చంద్రబాబు, జగన్


ఈ వ్యవసాయ బిల్లులను ఇప్పటికే ఆరేడు రాష్ట్రాలు వ్యతిరేకించాయని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కేంద్రం ముందు మోకరిల్లాయని నారాయణ మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన వారే హీరోలని తేల్చి చెప్పారు. సీఎం జగన్‌ కేంద్రానికి మద్దతు ఇవ్వక తప్పదని, ఆయన వ్యతిరేకిస్తే మరుసటి రోజే జైలుకు వెళ్తారన్న సంగతి ఆయనకు తెలుసన్నారు. అయితే చంద్రబాబుకు భయం ఎందుకని ప్రశ్నించారు.
అయినా చంద్రబాబు జైలుకు వెళ్తే మంచిది కదా అని నారాయణ వ్యాఖ్యానించారు. జగన్‌ కూడా జైలుకు వెళ్లడం వల్లే ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. కేంద్రాన్ని ఎదిరించి చంద్రబాబు కూడా జైలుకు వెళ్తే ఆయనకే మంచిదన్నారు. చంద్రబాబు బయట ఉండి చేసేది ఏముంది.. జూమ్ యాప్‌లో ఉండటం తప్ప అని ఎద్దేవా చేశారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీ సాగిలపడ్డారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.