యాప్నగరం

‘ప్రశాంత్ కిశోర్.. మీరైనా సీఎం జగన్‌కు చెప్పండి’

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు లేఖ రాశారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్‌కు చెప్పాలని కోరారు.

Samayam Telugu 30 Jan 2020, 5:44 pm
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ బహిష్కృత నేత ప్రశాంత్‌ కిశోర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ), దేశ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)కు మద్దతిచ్చిన నితీష్‌ కుమార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. అలాగే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వ్యూహకర్తగా వ్యవహరించినందున ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించాలని కోరారు.
Samayam Telugu Prashant-Kishor-YS-Jagan

‘‘కేంద్రానికి దాసోహమంటూ సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వైసీపీ ప్రభుత్వం మద్దుతు తెలిపింది. గత ఎన్నికల్లో వైసీపీకి సలహాదారుగా మీరు వ్యవహరించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సూచించండి’’ అని ప్రశాంత్ కిశోర్‌కు రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

Also Read: సీఏఏ, ఎన్ఆర్‌సీకి మద్దతిచ్చేది లేదు.. వైసీపీ ఎంపీల సంచలన నిర్ణయాలు

గత ఎన్నికల్లో వైసీపీకి ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే వైఎస్ జగన్‌కు, ప్రశాంత్ కిశోర్‌కు మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే బీజేపీ భాగస్వామ్యపక్షమైన జేడీయూకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్.. సీఏఏ, ఎన్ఆర్‌సీలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రశాంత్ కిశోర్‌తో పాటు పవన్ వర్మను పార్టీ నుంచి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ బహిష్కరించారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.