యాప్నగరం

తూ.గో: నోటి నుంచి నురగతో చనిపోతున్న కాకులు.. భయాందోళనల్లో జనాలు

తూర్పుగోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా కాకులు మృత్యువాతపడుతున్నాయి. కాకుల నురగలు వచ్చి చనిపోతుండటంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు.. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 10 Apr 2020, 11:54 am
తూర్పుగోదావరి జిల్లాలో వరుసగా కాకులు చనిపోవడం కలకలంరేపుతోంది. పి.గన్నవరం మండలం నరేంద్రపురం శివారు బూరుగు గుంటలో రెండు రోజులుగా కాకులు మృత్యువాతపడుతున్నాయి. కాకుల నురగలు వచ్చి చనిపోతుండటంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు.. పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం పశుసంవర్ధక శాఖ డీడీ ఏసురత్నం చనిపోయిన కాకులకు పోస్టుమార్టం నిర్వహించారు. పరిస్థితిని బట్టి కాకులను కాకినాడలోని డీఎల్‌డీఏ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేస్తామంటున్నారు.
Samayam Telugu kkd


మరోవైపు తమిళనాడులోని పనపాక్కంలో కూడా కాకులు అనుమానాస్పదంగా చనిపోవడం కలకలంరేపింది. కానీ అక్కడ లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ఆహారం లభించక ఆ కాకులు చనిపోతున్నాయని భావించారు. తర్వాత కాకులు ఎక్కువగా చనిపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్థానికులు ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకుని చనిపోయిన కాకులను తీయించి పూడ్చిపెట్టించారు. అవి ఆకలితో చనిపోతున్నాయా? లేదా వాటికి ఏదైనా వైరస్ సోకిందా అని తెలుసుకొనేందుకు శాంపిల్స్ తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.