యాప్నగరం

గోదావరి ప్రమాదం: ఎట్టకేలకు బయటపడ్డ బోటు.. ఐదు మృతదేహాలు లభ్యం

Royal Vasishta Boat: 37 రోజుల తర్వాత బోటును బయటకు తీసిన ధర్మాడి సత్యం. ఐదు డెడ్‌బాడీలను గుర్తించిన అధికారులు. మరో రెండు గంటల్లో ఒడ్డుకు చేరనున్న రాయల్ వశిష్ట బోటు.

Samayam Telugu 22 Oct 2019, 4:28 pm
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన బోటును ఎట్టకేలకు బయటకొచ్చింది. ధర్మాడి సత్యం టీమ్ మరికొద్దిసేపట్లో బోటును ఒడ్డుకు తీసుకురానున్నారు. మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉంది. మంగళవారం డైవర్ల సాయంతో మరోసారి నీటి అడుగుభాగం నుంచి రోప్‌లు కట్టి వెలికితీసే ప్రయత్నం చేశారు. పలుమార్లు వర్షం ఆటంకం కలిగించినా ఆపకుండా ప్రయత్నాలు కొనసాగించారు. జేసీబీ సాయంతో ఆ రోప్‌లను బయటకు లాగారు.. దీంతో నీళ్లపైకి బోటు వచ్చింది. బోటులో ఐదు డెడ్‌బాడీలను గుర్తించారు.
Samayam Telugu boat.


బాలాజీ మెరైన్స్‌ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం టీమ్ రెండుసార్లు బోటు వెలికితీత ప్రయత్నాలు చేసింది. బోటు మునిగిన కొద్ది రోజులకు బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వరద ఉధృతి పెరగడంతో వెలికితీత పనులు నిలిపివేశారు. గత వారంలో రెండసోరి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ రెండు, మూడు రోజుల పాటూ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కాకినాడా పోర్ట్ నుంచి కెప్టెన్ ఆదినారాయణను పిలిపించారు. అలాగే స్కూబా టీమ్ కూడా రంగంలోకి దిగింది.

బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం విశాఖ నుంచి డైవర్స్‌ను పిలిపించారు. వారి సాయంతో గోదావరిలోకి దిగి బోటుకు రోప్‌లు కట్టి బయటకు లాగే ప్రయత్నాలు చేశారు.. కానీ అది కూడా బెడిసికొట్టింది. ధర్మాడి సత్యం టీమ్ ప్రయత్నాలు ఫలించకపోయినా.. మంగళవారం మళ్లీ రోప్‌లు కట్టి బోటును బయటకు లాగింది. ఈసారి మాత్రం బోటు నీళ్లపైకి తేలింది.. దాన్ని ఒడ్డుకు చేర్చేందుకు ధర్మాడి సత్యం టీమ్ సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 15న బోటు కచ్చులూరు దగ్గర గోదావరిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 35మందికిపైగా చనిపోగా.. మరికొందరి ఆచూకీ దొరకలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.