యాప్నగరం

తొమ్మిదేళ్లుగా విడిపోయిన తల్లిదండ్రులు.. కలపలేక కూతురి ఆత్మహత్య

తొమ్మిదేళ్లుగా తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో వారిని కలిపేందుకు పిల్లలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎంతకీ తల్లిదండ్రులు కలిసి ఉండకపోవడంతో చివరకు చిన్న కూతురు ప్రాణం బలి తీసుకుంది.

Samayam Telugu 16 Jul 2020, 12:11 pm
భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. ఏదో విషయమై తరచూ తగాదాలు పడుతూనే ఉంటారు. అయితే కొందరు మాత్రం సంసారం అన్నాక సర్దుకుపోవాలంటూ... ముందుకు వెళ్లిపోతారు. కానీ కొందరు మాత్రం ఉడుంపట్టులా మారి తెగదెంపులు చేసుకొని ఎవరి బతుకు వారు బతుకుతుంటారు. తాజాగా ఇలా ఇద్దరు భార్యభర్తలు మనస్పర్థలతో విడిపోయారు. కానీ వారి పిల్లలు మాత్రం తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకున్నారు. అందుకే అనేక ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అవి ఫలించకపోవడంతో ఓ కన్న కూతురు కలత చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


తిరుపతి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన నాగరత్నమ్మ, మునిరాజయ్య భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తలు మనస్పర్థలతో తొమ్మిదేళ్ల కిందట విడిపోయారు. భర్తతో గొడవపడిన నాగరత్నమ్మ పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. తిరుపతి తుడా రోడ్డులోని వినాయకనగర్‌లో కాపురం ఉంటున్న తన తల్లితండ్రుల వద్దనే ఉంటుంది. భవనం మొదటి అంతస్తులో అద్దెకుంటూ చిల్లర అంగడి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. భర్త మునిరాజయ్య టైలర్‌ వృత్తి చేసుకుంటూ వేరుగా ఉంటున్నారు.
అయితే విడిపోయిన తమ తల్లిదండ్రులను కలపాలని కుమార్తెలు ఇద్దరూ పలుసార్లు ప్రయత్నించారు. కలసిన కొద్దిరోజులకే మళ్లీ విడిపోతున్నారు.
Read More: అఫైర్‌కు అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తపై గొంతుకోసి..
అయితే ఈ క్రమంలో చిన్న కూతురు గాయత్రి తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం ఉదయం 10 గంటలకు దుకాణంలోని అవ్వాతాతలు టీ ఇమ్మని కోరడంతో మొదటి అంతస్తులోని ఇంట్లోకి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంటి నుంచి పొగలు గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఇంట్లోకి పరుగులు తీశారు. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అయితే అప్పటికే తల నుంచి నడుం వరకు తీవ్రంగా కాలిపోయిన గాయత్రి మృతి చెందింది. గాయత్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో డిగ్రీ చదువుతోంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు పోలీసులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.