యాప్నగరం

ఏపీలో దంచికొడుతున్న ఎండలు.. ఈ జిల్లాల వారు జాగ్రత్త

మధ్యాహ్న సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అంటోంది. ఈ ఎండల తీవ్రత మంగళవారం కూడా ఎక్కువగానే ఉంది. పగటి పూట ఈ ఎండల దెబ్బకు జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

Samayam Telugu 9 Sep 2020, 6:39 am
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో వచ్చే మార్పులతో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వర్షాలు పడాల్సిన రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ అంటోంది. ఈ ఎండల తీవ్రత మంగళవారం కూడా ఎక్కువగానే ఉంది. పగటి పూట ఈ ఎండల దెబ్బకు జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మచిలీపట్నంలో 36.5, కడపలో 36.3.. రాజమహేంద్రవరం, తునిల్లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రాంతాల్లో జనాలు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
Samayam Telugu ఏపీలో ఎండలు


ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం, లక్షద్వీప్‌ ప్రాంతానికి దగ్గరగా కొనసాగుతున్న ద్రోణిలో విలీనమైంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో అంటే బుధ, గురు వారాల్లో రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రాలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటు ఈ నెల 11న కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు, 12న దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.