యాప్నగరం

ఈటల వీడియోతో జగన్ సర్కార్‌ను టార్గెట్ చేసిన మాజీ మంత్రి

పొరుగు రాష్ట్రాల వారు సరిహద్దుల దగ్గర గోడలు కట్టి లాక్ డౌన్ సరిగా అమలు చేయకపోతే కర్నూలు గుంటూరులా ఉండేవాళ్ళం అని మంత్రులు మాట్లాడుతున్నారు. దేశమంతా మనవైపు చూడడం అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి.

Samayam Telugu 2 May 2020, 2:53 pm
ఏపీలో కరోనా రాజకీయం కొనసాగుతోంది. లాక్‌డౌన్, కరోనా కేసుల వ్యవహారంపై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వీడియోతో జగన్ సర్కార్‌ను మాజీ మంత్రి దేవినేని ఉమా టార్గెట్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని ప్రతిపక్షంగా తాము హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు.
Samayam Telugu rajendar


ఉమా తన ట్వీట్‌లో.. బాధ్యత కలిగిన ప్రధానప్రతిపక్షంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులని బయటపెడుతుంటే ఎదురుదాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల వారు సరిహద్దుల దగ్గర గోడలు కట్టి లాక్ డౌన్ సరిగా అమలు చేయకపోతే కర్నూలు గుంటూరులా ఉండేవాళ్ళం అని మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. దేశమంతా మనవైపు చూడడం అంటే ఇదేనా జగన్ గారూ అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తన ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేయకపోతే భారీ నష్టం ఉండేదని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ అమలు చేయకపోయుంటే.. పరిస్థతి మరో కర్నూలు, గుంటూరులా ఉండేది అన్నారు. ఈ వీడియోను టీడీపీ అస్త్రంగా చేసుకుంది. సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.