యాప్నగరం

సీఎం జగన్‌పై రాజమౌళి ప్రశంసలు

ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న కష్టాల పట్ల స్పందించిన సీఎంకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

Samayam Telugu 10 Jun 2020, 11:39 am
సాధారణంగా రాజమౌళి రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఎలాంటి పొలిటికల్ గొడవల్లో, వివాదల్లో ఆయన అస్సలు కలుగజేసుకోరు. తన అభిప్రాయలు కూడా వ్యక్తం చేయరు. కేవలం సినిమా వరకు మాత్రం ఆయన పరిమితం అవుతారు. అయితే ఇటీవలే కేసీఆర్‌ను కలిసిన జక్కన్న... సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. తాజాగా ఏపీ సీఎం జగన్‌ను కూడా టాలీవుడ్ ప్రముఖులు కలిసిన విషయం తెలిసిందే. జగన్‌ను కలిసిన వారిలో రాజమౌళి కూడా ఉన్నారు. దీంతో సినీ పెద్దల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు జగన్ అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu జగన్ రాజమౌళి


ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించి.. అండగా నిలిచినందుకు క్షతజ్ఞతలు తెలిపారు. అలాగే థియేటర్ల ఫిక్స్‌డ్‌ పవర్‌ చార్జీల రద్దు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా రాజమౌళి ఓ పోస్ట్‌ చేశాడు. లాక్‌డౌన్‌ కారణంగా మూతపడ్డ సినిమా షూటింగ్స్‌ జూలై 15 తరువాత తిరిగి ప్రారంభించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా విశాఖపట్టణంలో సినిమా స్టూడియోలు నిర్మించుకోవాలనుకునే వారికి తక్కువ ధరకు స్థలాలు కేటాయించడానికి కూడా జగన్ అంగీకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.