యాప్నగరం

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లకు ఊరట.. కానీ చిన్న ట్విస్ట్

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై రెండు మూడుచోట్ల కేసులు నమోదు కావడంతో.. బెయిల్, విడుదలపై గందరగోళం నడుస్తోంది. జైలు నుంచి విడుదలపై క్లారిటీ రావాల్సి ఉంది.

Samayam Telugu 6 Aug 2020, 6:34 pm
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు ఊరట లభించింది. జిల్లా కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. గురువారం కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరిపై రెండుచ మూడుచోట్ల కేసులు నమోదు కావడంతో.. బెయిల్, విడుదలపై గందరగోళం నడుస్తోంది. జిల్లా కోర్టు ఇచ్చిన బెయిల్‌పై విడుదల అవుతారా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Samayam Telugu జేసీ ప్రభాకర్, అస్మిత్ రెడ్డి


బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిపై అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 13న హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కడప జిల్లాకు తరలించారు.. పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా.. ఇప్పటికి దొరికింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.