యాప్నగరం

పోలీసుల విచారణపై స్పందించిన రాయపాటి కోడలు మమత

రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు విచారణకు పిలిచారు. దాదాపు ఆరు గంటల పాటూ ఆమెను ప్రశ్నించారు. అనంతరం మాట్లాడిన మమత.. స్వర్ణప్యాలెస్‌లో జరిగిన ఘటనకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Samayam Telugu 15 Aug 2020, 6:47 am
విజయవాడ స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు విచారణకు పిలిచారు. దాదాపు ఆరు గంటల పాటూ ఆమెను ప్రశ్నించారు. అనంతరం మాట్లాడిన మమత.. స్వర్ణప్యాలెస్‌లో జరిగిన ఘటనకు, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని.. గుంటూరు రమేష్ హాస్పిటల్‌లో ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే తాను పరిశీలిస్తున్నాను అన్నారు. విజయవాడ ఆస్పత్రికి తనకి ఎలాంటి సంబంధం లేదని.. కేవలం విజయవాడ పోలీసులు నోటీస్ ఇవ్వడం వల్ల విచారణకు హాజరైనట్లు తెలిపారు.
Samayam Telugu డాక్టర్ మమత


స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పదిమందికి నోటీసులు ఇచ్చామని ఏసీపీ సూర్యచంద్రరావు అన్నారు. డాక్టర్ మమత విచారణకు హాజరయ్యారని.. ఆమె నుంచి కీలక అంశాలు రాబట్టామని చెప్పుకొచ్చారు. డాక్టర్ మమత అగ్ని ప్రమాదం జరిగిన రమేష్ ఆసుపత్రి కొవిడ్ కేర్ సెంటర్ పర్యవేక్షణ కూడా చూశారని.. ఆమెను ఇంకా విచారణ చేయాల్సి ఉంది అన్నారు. ఇదిలా ఉంటే రమేష్ ఆస్పత్రి యాజమాన్యంతో, స్వర్ణప్యాలెస్‌లోని కొవిడ్‌ సెంటర్‌తో మమతకు సంబంధం లేదని.. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులిచ్చారని రాయపాటి కుటుంబసభ్యులు ఆరోపించారు.

గత వారం విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన రమేష్ కోవిడ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్‌ యజమాని శ్రీనివాస్‌ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు విచారణను కూడా వేగవంతం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.