యాప్నగరం

TDP నేత శివప్రసాద్ అంత్యక్రియలు పూర్తి

సొంత ఊరిలో శివప్రసాద్ అంత్యక్రియలు. అంతిమ యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్య నేతలు. తమ అభిమాన నేతను చివరిసారిగా చూసేందుకు తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు.

Samayam Telugu 22 Sep 2019, 8:07 pm
టీడీపీనేత, చిత్తూరు మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. టీడీపీ కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాల మధ్య చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాలలో అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు.. ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేశార. అంతకు ముందు తిరుపతిలోని నివాసంలో శివప్రసాద్ పార్థీవ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, నేతలు నివాళులు అర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
Samayam Telugu tdp siva


సినీ నటుడు, మాజీ ఎంపీ శివప్రసాద్‌ శనివారం మధ్యాహ్నం కన్నమూశారు. వెన్నునొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస. కొద్దిరోజులుగా అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్‌లో చికిత్సపొందుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కొద్దిరోజుల క్రితం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.

శివప్రసాద్ 1995లో టీడీపీలో చేరారు. 1999లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. తర్వాత 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

శివప్రసాద్ రాజకీయ రంగం మాత్రమే కాదు.. సినిమాల్లోనూ రాణించారు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. విభజన, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో శివప్రసాద్ తన వేషాలతో వెరైటీగా నిరసన తెలియజేశారు. హోదా హామీని నెరవేర్చాలంటూ పార్లమెంట్ ముందు వెరైటీ వేషధారణల్లో ఆందోళనలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.