యాప్నగరం

జగన్ భజన కోసం రూ.5లక్షలా.. ఆ జీవోను రద్దు చేయాలి: మాజీ మంత్రి ఫైర్

'' జగన్ అన్న జయహో జైత్రయాత్ర నాటకాల'' కోసమా ఒకవైపు వేలకోట్లు అప్పులుచేస్తూ మీకు భజన చేయడంకోసం జీవో98ను ఎలా విడుదల చేస్తారు అంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి.

Samayam Telugu 16 May 2020, 10:45 am
జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టి జగన్ పేరుతో నాటకాల కోసమా అంటూ మండిపడ్డారు. వలస కార్మికుల విషయంలోనూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కోర్టు స్పందించే వరకు పట్టించుకోరా.. అన్నా క్యాంటీన్లు ఉంటే కష్టాలు ఉండేవి కాదన్నారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
Samayam Telugu దేవినేని ఉమా


కరోనా కష్ట సమయంలో విశాఖ గుంటూరులలో వందలకోట్ల విలువైన ప్రభుత్వ భూములు వేలానికి పెట్టింది '' జగన్ అన్న జయహో జైత్రయాత్ర నాటకాల'' కోసమా ఒకవైపు వేలకోట్లు అప్పులుచేస్తూ మీకు భజన చేయడంకోసం జీవో98ను ఎలా విడుదల చేస్తారు అని ప్రశ్నించారు. తక్షణమే జీవోను రద్దుచేయమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జగన్ గారు అంటూ ట్వీట్ చేశారు.
సొంతూరు చేరాలని 53 రోజులుగా వలసకార్మికులు దాతలుపెడితే తింటూ పంపు నీరు తాగుతూ చెప్పులరిగిపోయేలా సాగిస్తున్న "నరకయాత్ర"పై ఉన్నత న్యాయస్థానం స్పందించి ఆదేశాలిచ్చింది అన్నాక్యాంటీన్లు ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేదికాదు కదా అన్నారు. ఇప్పటికైనా స్పందించండి రాజప్రసాదంలోని ముఖ్యమంత్రి జగన్ గారు అంటూ మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.