యాప్నగరం

జైలు నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విడుదల.. 28 రోజులు బెజవాడలో, ఎందుకంటే!

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 53 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే 28 రోజుల పాటూ విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆయన్ను ఆదేశించింది.

Samayam Telugu 26 Aug 2020, 9:08 am
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్‌పై విడుదలయ్యారు. కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా.. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు.. 53 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే 28 రోజుల పాటూ విజయవాడలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.. అది కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కరోనా కేసులు ఉన్నాయి.. అందుకే ఆయన్ను విజయవాడలోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోర్టు సూచించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu కొల్లు రవీంద్ర


మచిలీపట్నంకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్ర ఏ-4 ఉన్నారు. ఆయన నిందితులకు సహకరించారనే అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా కనిపించకుండా పోయారు. తర్వాత జులై మూడున ఆయన్ను తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం ముందు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.. చివరికి కోర్టు బెయిల్ ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.