యాప్నగరం

జగన్‌ను వైఎస్‌తో పోల్చద్దు.. రాళ్లు వేయించిన కేసీఆర్‌కు ప్రేమ ఎలా పుట్టింది: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

జగన్ మహబూబాబాద్ వచ్చినప్పుడు రాళ్లు రువ్వించి.. అరెస్ట్ చేయించిన కేసీఆర్‌కు జగన్ ఇప్పుడు ఎలా తీపి అయ్యారని ప్రశ్నించారు .జగన్‌తో కేసీఆర్ ఎందుకు పదే, పదే సమావేశాలు పెడుతున్నారు.. అది కూడా వ్యక్తిగతంగా..

Samayam Telugu 15 Sep 2020, 8:35 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి-తెలంగాణ సీఎం కేసీఆర్‌ల స్నేహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొండా సురేఖ. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక అంశాలను ప్రస్తావించారు. 2014 ఎన్నికల నుంచే కేసీఆర్-జగన్‌ల మధ్య ఒప్పందాలు జరిగాయన్నారు సురేఖ. ఆ సమయంలోనే జగన్ గెలుస్తారని.. చంద్రబాబు ఓడిపోతారని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ వైఎస్‌ను తిట్టిన వ్యక్తే కదా.. మరి జగన్‌ మీద ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. జగన్‌కు కేసీఆర్ డబ్బు పంపి గెలిపించారని.. చంద్రబాబుపై కోపమో.. జగన్ వస్తే అంతర్గతంగా కొన్ని ఒప్పందాలు చేసుకుందామని కావొచ్చు అన్నారు.
Samayam Telugu కేసీఆర్ జగన్


జగన్ మహబూబాబాద్ వచ్చినప్పుడు రాళ్లు రువ్వించి.. అరెస్ట్ చేయించిన కేసీఆర్‌కు జగన్ ఇప్పుడు ఎలా తీపి అయ్యారని ప్రశ్నించారు సురేఖ. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ఎందుకు సత్సంబంధాలు కొనసాగించలేదని.. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం ఎందుకు కూర్చోలేదన్నారు. మరి ఇప్పుడు జగన్‌తో కేసీఆర్ ఎందుకు పదే, పదే సమావేశాలు పెడుతున్నారని.. అది కూడా అధికారికంగా కాకుండా వ్యక్తిగతంగా ఎందుకు భేటీలు జరుగుతున్నాయని ప్రశ్నించారు.

జగన్ పాలనకు వైఎస్ పాలనకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందన్నారు మాజీ మంత్రి. జగన్ పాలన కక్షసాధింపు కనిపిస్తోంది.. ప్రజలకు పాలన అందించాల్సిందిపోయి టీడీపీపై కక్షసాధిస్తారని వ్యాఖ్యానించారు.. అది మంచిది కాదన్నారు. రాజకీయం ఎన్నికల వరకే ఉండాలి.. తర్వాత అన్ని మర్చిపోయి అందర్నీ సమానంగా చూడాలి అని సురేఖ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన సురేఖ.. ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీ స్థాపించిన సమయంలో జగన్‌కు అండగా నిలిచారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు.. తర్వాత విభేదాలతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ పార్టీగూటికి వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.