యాప్నగరం

'జగన్‌కు ఆ విషయం అర్ధంకావట్లేదు.. రేపు విశాఖవాసుల్ని కూడా'

జగన్ గారి మనసు కరగదా.. ఇప్పుడు అమరావతి రైతుల వంతు.. రేపు విశాఖవాసులకు అన్యాయం చేయరని నమ్మకం ఏంటి.. జగన్‌గారికి ఆ విషయం ఎందుకు అర్ధం కావడం లేదన్న లోకేష్.

Samayam Telugu 10 Feb 2020, 1:59 pm
అమరావతిలో రైతుల ఉద్యమం కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా.. రాజధానిని తరలించొద్దంటూ ఇద్దరు యువకులు 151గంటల దీక్ష చేపట్టారు.. కానీ వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో దీక్షను భగ్నం చేశారు. ఇద్దర్ని బలవంతంగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యం నిరాకరించి.. యువకులు దీక్షను కొనసాగిస్తున్నారు.
Samayam Telugu ys jagan.


యువకులు చేస్తున్న దీక్షపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఆరోగ్యం విషమించినా రాష్ట్ర భవిష్యత్తు అయిన అమరావతిని మాత్రం వదలలేదు అన్నారు. పోలీసులు దీక్ష భగ్నంచేసినా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు యువకులు. ఆందోళనలు 55వ రోజుకు చేరినా జగన్ గారి మనసు కరగడం లేదన్నారు. జగన్ గారు ఈరోజు అమరావతి రైతులకు చేసిన అన్యాయం రేపు విశాఖ రైతులకు చెయ్యరని నమ్మకం ఏంటి అని ప్రశ్నించారు. మూడు ముక్కల రాజధాని వద్దు.. అభివృద్ధే ముద్దు" అని అన్ని ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. జగన్ గారికి మాత్రం ఈ విషయం అర్ధం కావడం లేదన్నారు లోకేష్.
ఇటు జగన్ గారి మొదటి సంతకమే మాయ అంటున్నారు లోకేష్. మాట మార్చి, మడమ తిప్పి పెన్షనర్లను మోసం చేసారని.. 'నేను విన్నాను, నేను ఉన్నాను 3 వేల పెన్షన్ పక్కా అన్న జగన్ గారు.. నేను వినలేదు, నేను లేను' అంటూ 250 రూపాయిలు పెంచి అవ్వా, తాతలను దగా చేసారని ఆరోపించారు. రాజన్న రాజ్యంలో 60 ఏళ్లకే పెన్షన్ అని 8 నెలలు అయినా 60 ఏళ్లు దాటిన ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వకుండా రాక్షస రాజ్యాన్ని తలపిస్తున్నారని మండిపడ్డారు. పండుటాకుల పై జగన్ గారికి అంత కక్ష ఎందుకో అర్ధం కావడం లేదని.. ఒకే సారి 7 లక్షల పెన్షన్లు ఎత్తేసారని ఆరోపించారు. ఆఖరికి దివ్యాంగుల పెన్షన్ కూడా తీసివెయ్యడానికి మీకు మనస్సు ఎలా వచ్చింది.. వారికి న్యాయం జరిగే టీడీపీ పోరాడుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.