యాప్నగరం

వైసీపీ ఎమ్మెల్యేపై జగన్ సెటైర్లు.. వీడియో ట్వీట్ చేసి లోకేష్ ట్రోలింగ్

ముఖాలు కనిపించకుండా మాస్క్‌తో ఫొటో తీయించుకుంటే ఏం ఉపయోగం సామీ అంటూ సీఎం జగన్ తనదైన శైలిలో అన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆ ప్రాంగణంలో నవ్వులు విరిశాయి.

Samayam Telugu 24 Sep 2020, 11:19 am
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు వచ్చే సమయంలో రేణిగుంట విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని సీఎం జగన్ ఆటపట్టించారు. సీఎం జగన్‌కు ఆహ్వానం పలికేందుకు వచ్చిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన కుమార్తె పవిత్ర.. ఆయన ఫొటో తీయించుకునేందుకు ప్రయత్నించారు. అయితే తండ్రీకూతుళ్లు ఇద్దరూ మాస్క్ ధరించి ఫొటోకు ఫోజిచ్చారు. దీంతో సీఎం జగన్ ఎమ్మెల్యేను ఆటపట్టించినట్లుగా తెలుస్తోంది.
Samayam Telugu లోకేష్ సెటైర్లు


ముఖాలు కనిపించకుండా మాస్క్‌తో ఫొటో తీయించుకుంటే ఏం ఉపయోగం సామీ అంటూ సీఎం జగన్ తనదైన శైలిలో అన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆ ప్రాంగణంలో నవ్వులు విరిశాయి. వెంటనే తేరుకున్న ఎమ్మెల్యే, ఆయన కుమార్తె పవిత్ర చిరునవ్వు చిందిస్తూ సీఎం జగన్‌తో ఫొటో తీయించుకున్నారు. ఈ వీడియోను మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసి సెటైర్లు పేల్చారు. వైసీపీ ఎమ్మెల్యే మాస్క్‌ను జగన్ తీయమనడంపై లోకేష్ మండిపడ్డారు.

‘లక్షల్లో కరోనా కేసులు,వేల సంఖ్యలో ప్రజల చనిపోతున్నారు. అయినా వైఎస్ జగన్ గారు మాత్రం మూర్ఖత్వానికి మానవ రూపంగానే మిగిలిపోయారు.ఆయన మాస్క్ పెట్టుకోరు,వేరే వాళ్ళు పెట్టుకుంటే ఊరుకోరు.మరి దళిత యువకుడు కిరణ్ ని మాస్క్ పెట్టుకోలేదని కొట్టిచంపడం ఎందుకు?..పోలీస్ స్టేషన్ లో కిరణ్‌ని చంపింది మాస్క్ వేసుకోలేదనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?’అంటూ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.