యాప్నగరం

'జగన్‌కు ప్రధాని మోదీ చివాట్లు పెట్టారు'.. యనమల సంచలన వ్యాఖ్యలు

ఏడు సార్లు ప్రధాని, కేంద్ర హోంమంత్రిని జగన్‌ కలిశారు.. కేంద్రం నుంచి ఫ్లైట్‌ ఖర్చులు కూడా తెచ్చుకోలేకపోయారు. సీఎం జగన్‌ ఏడు సార్లు దిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారని.. ఆ వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు.

Samayam Telugu 13 Feb 2020, 2:39 pm
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలతో ఏం ఒరిగిందో చెప్పాలంటున్నారు మాజీ మంత్రి యనమల. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా.. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా అదనంగా రాలేదని.. ఏడు సార్లు ప్రధాని, కేంద్ర హోంమంత్రిని జగన్‌ కలిశారు.. కేంద్రం నుంచి ఫ్లైట్‌ ఖర్చులు కూడా తెచ్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఢిల్లీకి పిలిపించి మరీ ప్రధాని చీవాట్లు పెట్టారని తమకు సమాచారం ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ys jagn.


Read Also: 'ఏంటి ప్రధాని మోదీ జగన్‌ను మందలించారా

జగన్ మళ్ళీ శుక్రవారం ఢిల్లీ వెళ్ళేది సొంత విషయాల కోసమేనా అని ప్రశ్నించారు. ఇక్కడ మాత్రం ప్రభుత్వ వ్యవహారాలు అని మాట చెప్పి వెళ్తున్నారన్నారు. ఎన్ని నిమిషాలు మాట్లాడారో కాదు.. ఎన్ని నిధులు తెచ్చారన్నది ముఖ్యమన్నారు. జగన్‌ ఢిల్లీ టూర్‌తో రాష్ట్రానికి ఒక్క రూపాయి ప్రయోజనం లేదని.. మోదీకి ఇచ్చిన వినతిపత్రం అంశాలను బయటపెట్టలేదో చెప్పాలన్నారు. సీఎం జగన్‌ ఏడు సార్లు దిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారని.. ఆ వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు.

Also Read: 'సింగిల్ హ్యాండ్.. జగన్‌‌కే ఆ ఘనత దక్కింది': లోకేష్

మూడు రాజధానుల ప్రకటనతో.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావట్లేదన్నారు యనమల. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మెండిచెయ్యి చూపించినా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అప్రజాస్వామిక చర్యలతో ఎనిమిది నెలల్లో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందన్నారు.

వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి పంపితే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు మాజీ మంత్రి. రాజధానుల వికేంద్రీకరణ బిల్లు సభ ఆమోదం పొందినట్లే అంటున్న వైసీపీ నేతలది కేవలం అవగాహనారాహిత్యమని.. సెలెక్ట్ కమిటీకి రాజధానుల బిల్లు పంపే వరకు ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ 14 రోజులు ముగిసింది కనుక బిల్లులు పాస్ అయ్యాయని చెబుతోందని.. ఈ నిబంధన కేవలం మనీ బిల్లులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తు చేశారు. వైసీపీ నేతలకు రూల్స్ తెలియదు..చట్టాల పై అవగాహన లేదన్నారు. బిల్లులు మండలికి రాకుండా పాస్ చేయించడం కుదరదని తేల్చి చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.