యాప్నగరం

చింతమనేని ఇంట పెళ్లి సందడి.. నియోజకవర్గ ప్రజలకు స్పెషల్ గిఫ్ట్

వివాహానికి శ్రేయాభిలాషులైన అందర్ని ఆహ్వానించి, నూతన దంపతులకు ఆశీస్సులు అందించమని కోరడానికి కరోనా నియమ నిబంధనలు ఆటంకంగా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం అంటూ..

Samayam Telugu 11 Dec 2020, 11:21 am
మాజీ విప్, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ప్రభాకర్ పెద్ద కుమార్తె సాయి నవ్య శ్రీ వివాహానికి జనవరి 2న ముహూర్తం ఖాయమైంది. ఈ వివాహ శుభ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో ప్రజలకు స్పెషల్ గిఫ్ట్ అందజేస్తున్నారు. మొత్తం లక్ష స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samayam Telugu చింతమనేని ఇంట పెళ్లి సందడి

వచ్చే నెల 2న తన కుమార్తె సాయి నవ్య శ్రీ వివాహానికి సుమూర్తం నిశ్చయించారని.. శ్రేయాభిలాషులైన అందర్ని ఆహ్వానించి, నూతన దంపతులకు ఆశీస్సులు అందించమని కోరడానికి కరోనా నియమ నిబంధనలు ఆటంకంగా ఉన్న విషయం తెలిసిందే అన్నారు. అందుకే పరిస్థితుల్ని గమనించి, సహృదయంతో వారి, వారి ఇళ్ల నుంచి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందించాలని స్వీట్ బాక్సులపై కోరారు.. అలాగే వివాహ వేడుకకు సంబంధించిన లింక్‌లను ముద్రించారు. కొద్దిమంది అతిథుల మధ్య ఈ వివాహ వేడుకను నిర్వహించాలని చింతమనేని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.