యాప్నగరం

AP Capital: మూడు రాజధానులు.. చింతమనేని ఆసక్తికర వ్యాఖ్యలు

మూడు రాజధానుల నిర్ణయం. అమరావతి రైతుల ఆందోళనలపై స్పందించిన మాజీ విప్ చింతమనేని ప్రభాకర్. రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులు భూములు ఇవ్వలేదు.

Samayam Telugu 7 Jan 2020, 11:16 am
ఏపీలో రాజధాని అంశంపై పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్టీలు, నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ప్రాంతాలవారీగా నేతలు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కొందరు మూడు రాజధానుల్ని సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కూడా రాజధాని చిచ్చు రేగింది. ఉత్తరాంధ్ర, సీమ నేతలు చంద్రబాబు నిర్ణయానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu prabhakar


తాజాగా మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ మూడు రాజధానుల అంశంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని.. కమిటీలన్నీ జగన్ స్క్రిప్ట్‌లనే చదువుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చడమే అమరావతిపై జగన్‌కు ఉన్న కోపాన్ని తెలిపిందని.. అమరావతి నిర్మాణం చేసి తీరాలని డిమాండ్ చేశారు.. రాజధానిని తరలించడం సాధ్యం కాదన్నారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని అన్నది ఎవరని ప్రశ్నించారు చింతమనేని ప్రభాకర్. రాజధానికి ల్యాండ్ పూలింగ్‌లో అమరావతి రైతులు భూములు ఇచ్చారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతులు భూములు ఇవ్వలేదని గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు చింతమనేని ప్రభాకర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.