యాప్నగరం

బస్తీ మే సవాల్.. చంద్రబాబు ర్యాలీలో జేసీ హెచ్చరిక

పెనుకొండ సమీపంలో చంద్రబాబు ర్యాలీతో ఉద్రిక్తతలు. బాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు. బస్సు దిగి బస్తీ మే సవాల్ అంటూ హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే జేసీ.

Samayam Telugu 13 Jan 2020, 3:58 pm
టీడీపీ అధినేత చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది. అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా బాబు అనంతపురం జిల్లా పాల సముద్రం చేరుకున్నారు.. అక్కడ జోలె పట్టి విరాళాలు సేకరించారు. చంద్రబాబు రాకను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రతిఘటించారు.
Samayam Telugu jc


ఈ ఉద్రిక్తతలు నడుమ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి బస్సు దిగారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎదురు వెళ్లి బస్తీ మే సవాల్‌ అంటూ హెచ్చరించారు. వారు కూడా వాగ్వాదానికి దిగడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు సర్థిచెప్పడంతో ఉద్రిక్తత సద్ధుమణిగింది. తర్వాత చంద్రబాబు కాన్వాయ్ అక్కడి నుంచి బయల్దేరి వెళ్లింది. అనంతరం చంద్రబాబు పెనుకొండకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొన్నారు.

అలాగే చంద్రబాబు సాయంత్రం అనంతపురంలో పండ్లు, టీ విక్రయించి చంద్రబాబు నిధులు సేకరించనున్నారు. అక్కడ కూడా జోలె పట్టి అమరావతి కోసం విరాళాలు సేకరించనున్నారు. అనంతరం జరిగే బహరింగ సభలో ప్రసంగించనున్నారు. చంద్రబాబు అమరావతి పరిరక్షణ యాత్ర పేరుతో ఐదారు రోజులుగా యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.