యాప్నగరం

జగన్ ఆయనకు మాత్రమే భయపడతారు.. జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎందుకంటే ఆయన ఏమైనా జగన్‌‌ను చేస్తాడేమో అనే భయం ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం లేదు.. చెప్పిందే జరగాలి అనడం సరికాదని.. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినరని మండిపడ్డారు.

Samayam Telugu 1 Jun 2020, 12:36 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 151మంది ఎమ్మెల్యేలు ఉంటే నేనే రాజు నేనే మంత్రి అనుకోవడం తప్పన్నారు. జగన్ ఎవరి మాటా వినరని.. ఆయన వింటే ప్రధాని నరేంద్ర మోదీ మాట మాత్రమే వింటారన్నారు. ఎందుకంటే ఆయన ఏమైనా జగన్‌‌ను చేస్తాడేమో అనే భయం ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం లేదు.. చెప్పిందే జరగాలి అనడం సరికాదని.. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా జగన్ వినరని మండిపడ్డారు.
Samayam Telugu జేసీ దివాకర్‌రెడ్డి


జగన్ పాలనపై చదువుకున్న వారందరికీ అవగాహన వచ్చిందన్నారు జేసీ. ఎస్ఈసీ విషయంలో ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంలో తప్పులేదు.. రమేష్‌కుమార్‌ను కొనసాగించకపోవడం సరికాదన్నారు. నేటి రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని.. నీలం సంజీవరెడ్డి హయాంలో జరిగిన ఈ విషయాన్ని ప్రస్తావించారు. కర్నూలులో బస్సుల జాతీయం చేసినప్పుడు హైకోర్టు ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డి గారు కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేసి ఉండాల్సింది కొన్ని వ్యాఖ్యలు చేసిందన్నారు.

సీఎంగా ఉన్న సంజీవరెడ్డిని కోర్టు తప్పుబట్టలేదని.. సలహా ఇచ్చిందన్నారు దివాకర్‌రెడ్డి. న్యాయస్థానానికి గౌరవం ఇవ్వాలని సంజీవరెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు నీతి లేదు, న్యాయం లేదు.. రాజ్యాంగబద్ధంగా పాలించాలే తప్ప తానే నియంతలా ఉండటం సరికాదన్నారు. సంజీవరెడ్డి వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. అమరావతి రాజధాని కోసం అన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా ముఖ్యమంత్రి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ముఖ్యమంత్రి పోలేకపోతే ఆయన సన్నిహితులు వెళ్లాలన్నారు. దీక్షలు చేసినంత మాత్రన సీఎం మనసు మారదన్నారు. దేవుడే అందరిని కాపాడాలి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.