యాప్నగరం

జగన్‌కు ఆ బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా.. ఏపీ సీఎంకు ఉండవల్లి లేఖ

రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ రోగులకు తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు అన్ని ఫంక్షన్ హాళ్లు స్వాధీనం చేసుకుని వాటిని ఎన్జీవోలు, ట్రస్ట్‌లకు అప్పగించాలన్నారు.

Samayam Telugu 30 Jul 2020, 5:22 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖ రాశారు. కరోనా కట్టడి, క్వారంటైన్, ఐసోలేషన్ సెంటర్లపై కీలక సూచనలు చేశారు. కోవిడ్ రోగులకు తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు అన్ని ఫంక్షన్ హాళ్లు స్వాధీనం చేసుకుని వాటిని ఎన్జీవోలు, ట్రస్ట్‌లకు అప్పగించాలన్నారు. కోవిడ్ సహాయ కేంద్రాల నిర్వహణ ఖర్చును ఎన్జీవోలు, ట్రస్ట్‌లు భరిస్తాయని ప్రభుత్వం నుంచి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని అందించాలని కోరారు.
Samayam Telugu ఉండవల్లి లేఖ


కోవిడ్ పరీక్షలకు ప్రైవేట్ ఆస్పత్రులను కూడా అనుమతించి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. ప్రస్తుతం పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు డబ్బు.. పలుకుబడి ఉంటే తప్ప కరోనా బారినపడి జీవించలేమని ఆవేదన చెందుతున్నారన్నారు. కరోనాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని గెలవడానికి జగన్‌కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను అన్నారు. రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే అద్దెకు కళ్యాణ మండపం తీసుకొని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతోందని గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.