యాప్నగరం

డాలర్ శేషాద్రికి కరోనా అంటూ ట్వీట్.. వ్యక్తి అరెస్ట్

తిరుమలలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే 18మంది అర్చకులు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నడిచింది.

Samayam Telugu 20 Jul 2020, 3:16 pm
తిరుమలలో ఓ ట్వీట్ కలకలం రేపింది. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి ఆరోగ్యంపై చేసిన తప్పుడు ప్రకటనలపై కేసు నమోదైంది. డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అంటూ ఎస్వీ బద్రి అనే వ్యక్తి ట్వీట్ చేశారు. డాలర్ శేషాద్రికి ఆరోగ్యం బాగోలేదని, ప్రతీ రెండు నెలలకు ఒకసారి ఆయన పరీక్షలు చేయించుకుంటున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే... అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేశారంటూ ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అనుచరుడు ఎస్‌వీ బద్రీ ట్వీట్ చేశారు.
Samayam Telugu డాలర్ శేషాద్రి (ఫైల్ ఫోటో)
dollor seshadri

Read More: ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం.. మరో 9 మందికి పాజిటివ్
దీంతో శేషాద్రి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేశారంటూ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. తనపై ఎస్‌వీ బద్రి అనే వ్యక్తి ట్విటర్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విజిలెన్స్‌ వింగ్‌ ఏవీఎస్‌వో నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌కు డాలర్ శేషాద్రి ఫిర్యాదు చేశారు. భక్తులను భయాందోళనకు గురి చేసేలా ట్వీట్‌ చేశారని ఆరోపించారు. దీంతో టీటీడీ అధికారులు తిరుమల ఫస్ట్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బద్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరోవైపు తిరుమలలో కరోనా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు టీటీడీ సిబ్బందితో పాటు స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు కరోనా సోకింది. ఆలయంలో పని చేసే మొత్తం 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒక సీనియర్ అర్చకునికి మెరుగైన చికిత్స అందివ్వడానికి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అర్చకులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.