యాప్నగరం

మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌ బాటిల్‌తో రైతు హంగామా

మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులోకి పెట్రోల్ బాటిల్‌తో వెళ్లేందుకు ప్రయత్నించిన రైతు. తన పట్టాదారు పాసుపుస్తకంకు సంబంధించిన సమస్యను పరిష్కరించలేదని మనస్తాపం.

Samayam Telugu 25 Nov 2019, 4:34 pm
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో రైతు హల్‌చల్ చేశాడు. పెట్రోల్ బాటిల్‌తో ఆఫీసులోకి రావడంతో.. అధికారులు, కార్యాలయ సిబ్బంది షాక్ తిన్నారు. అతడు లోపలికి రాకుండా అడ్డుకొని.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తన సమస్యను పరిష్కరించకుండా రోజూ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని రైతు ఆరోపిస్తున్నాడు.
Samayam Telugu mng.


స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. మంగళగిరి ప్రాంతానికి చెందిన రైతు శివ కోటేశ్వరరావు పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చాలా రోజులుగా తన సమస్యను పరిష్కరించి.. పాసు పుస్తకం ఇవ్వాలని అధికారుల్ని కోరాడు. ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినా సమస్యను పరిష్కరించకపోవడంతో.. మనస్తాపం చెందిన ఆయన పెట్రోల్ బాటిల్‌తో వచ్చినట్లు చెబుతున్నారు.

తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఘటన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి తరహా ఘటనలే జరిగాయి. తెలంగాణతో పాటూ ఏపీలోనూ అక్కడక్కడా రైతులు పెట్రోల్ బాటిళ్లతో ఎమ్మార్వో ఆఫీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదాలే తప్పాయి. తాజాగా మంగళగిరిలో ఘటన జరగడంతో రెవెన్యూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.