యాప్నగరం

కడప: కూతురి మరణాన్ని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె

కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోడంతో తండ్రి మనసు తల్లడిల్లింది.. ఆయన కూడా మానసికంగా బాధపడ్డారు. ఆయన కూడా అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 27 Jul 2020, 10:54 am
కడప జిల్లాలో విషాదకరమైన ఘటన జరిగింది. కూతురు మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయింది. రాయచోటికి చెందిన సుభాన్ గతంలో వీఆర్వోగా పనిచేశారు. అయితే ఆయన కుమార్తె ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోడంతో తండ్రి మనసు తల్లడిల్లింది.. ఆయన కూడా మానసికంగా బాధపడ్డారు. ఆయన కూడా అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తర్వాత సుభాన్ కుమార్తె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసింది.
Samayam Telugu కడప జిల్లాలో విషాదం


కూతురు మరణ వార్త తెలియడంతో సుభాన్‌కు గుండెపోటు వచ్చింది.. ఆయన కూడా ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇది వరకే గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పారు. తండ్రి, కుమార్తె మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూతురి మరణాన్ని ఆ తండ్రి గుండె తట్టుకోలేపోయింది. ఇంట్లో తండ్రీ, కూతుళ్లు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.