యాప్నగరం

విశాఖ జిల్లాలో కాల్పుల మోత.. నిన్న తప్పించుకున్న మావోలే టార్గెట్!

విశాఖ జిల్లాలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులే లక్ష్యంగా పోలీసు బలగాలు జీకే వీధి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మావోలు తారసపడడంతో ఇద్దరి మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్న తెలుస్తోంది.

Samayam Telugu 23 Sep 2019, 9:15 pm
విశాఖపట్నం జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మరో 12 మంది మావోయిస్టుల కోసం పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ చేపట్టాయి.
Samayam Telugu 218812-fire


Must Read:
రివర్స్‌ టెండరింగ్‌ ఓ డ్రామా.. తెరవెనుక వేరే కథ! దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు

విశాఖ జిల్లా జీకే వీధి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసు బలగాలకు పీమలగింది వద్ద మావోయిస్టులు తారసపడడంతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్ల సమాచారం. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. పోలీసులు మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రా ఒడిశా బోర్డర్(ఏవోబీ)లోకి చొరబడినట్లు తెలుస్తోంది.

Also Read: పోలవరం రివర్స్ టెండర్లు చెల్లనట్టేనా.! అసలు ఆ జీవో ఏం చెబుతోంది?

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చి చంపిన సరిగ్గా ఏడాదికి ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎమ్మెల్యే హత్యకు నాయకత్వం వహించిన మావో కమాండర్ అరుణతో సహా మరో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.