యాప్నగరం

విశాఖ: కిక్కు కోసం స్పిరిట్ తాగి ఐదుగురు మృతి

కిక్కు కోసం స్పిరిట్ తెచ్చుకుని తాగారు.. తీవ్ర అస్వస్థతకు గురై ఐదుగురు మృతి. చనిపోయిన వారంతా కూలిపనులు, ఆటో నడుపుకుని జీవించేవాళ్లే. విశాఖ జిల్లా కశింకోట గోవిందరావు కాలనీలో ఘటన.

Samayam Telugu 1 Jun 2020, 8:31 am
విశాఖలో విషాద ఘటన జరిగింది. స్పిరిట్‌ను నాటుసారాగా పొరబడి తాగేయడంతో ఐదుగురు చనిపోయారు. కశింకోట గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనందరావు తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామనుకున్నాడు. మంచి కిక్ కోసం మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్ తీసుకొచ్చాడు.. స్నేహితులంతా దాన్ని తాగేశారు. డోసు పెరిగిందో ఏమో తాగినవాళ్లంతా తీవ్ర అస్వస్థతకు గురికాగా.. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.
Samayam Telugu విశాఖపట్నం


ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరికి స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన వారిని వడిసెల నూకరాజు, కూనిశెట్టి ఆనంద్, పెతకం శెట్టి అప్పారావులుగా గుర్తించారు. చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒకరు లారీ క్లీనర్. ఆస్పత్రిలో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న మాణిక్యం రోజువారీ కూలిపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.