యాప్నగరం

ఏపీలో రూ. 100కే ఐదు రకాల పండ్లు డోర్ డెలివరీ

ఏపీలో 5 రకాల పండ్లను రూ. 100కే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పండ్లను కిట్ల రూపంలో అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.

Samayam Telugu 23 Apr 2020, 10:05 am
ఉద్యానవన శాఖ, మెప్మా ద్వారా తాజా పండ్లను కిట్ల రూపంలో ప్రజలకు చౌకగా అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం రూ. 100కే 5 రకాల పండ్లను డోర్‌ డెలీవరి సదుపాయాన్ని మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యానవన రైతులకు మేలు జరిగేలా.. వినియోగదారులకు చౌకగా పండ్లు అందించేలా కిట్ల రూపంలో డోర్‌ డెలీవరీ చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి కన్నబాబు.
Samayam Telugu EWIZz7RVAAAvoxn


ముందుగా రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో వీటిని ప్రారంభించి త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి కన్నబాబు చెప్పారు. మామిడి పండ్ల సీజన్‌ మొదలైన నేపథ్యంలో మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విశాఖపట్నం నుంచి ఇతర రాష్ట్రాలకు140 టన్నులు, తిరుపతి నుంచి 1.2 టన్నుల మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ వంగా గీత అన్నారు. ధరలు పెరగకుండా వినియోగదారులను ఆదుకుంటున్నారని తెలిపారు. రూ. 100లకే ఐదు రకాల పండ్లు సదుపాయాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కాగా, ఆయా జిల్లాల్లో లభించే పండ్లను బట్టి డోర్ డెలివరీ చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.