యాప్నగరం

ఏపీ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ శ్రీనాథ్ రెడ్డి మృతి

Devireddy Srinath Reddy కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. 2019 నుంచి 2022 వరకు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ బాధత్యలు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 23 Mar 2023, 7:56 am

ప్రధానాంశాలు:

  • ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ శ్రీనాథ్ రెడ్డి మృతి
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు
  • 2019 నుంచి 2022 వరకు ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌‌గా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Devireddy Srinath Reddy
ఆంధ్రప్రదేశ్ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిది కడప జిల్లా సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లె.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో శ్రీనాథ్ రెడ్డి పీజీ చేశారు. ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చారు.
వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు. 24 ఏళ్ల పాటూ ఏపీయూడబ్ల్యుజే కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. అలాగే రాయలసీమ ఉద్యమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మైసూరారెడ్డి వంటి నేతలతో కలిసి పనిచేశారు. 2019 నుంచి 2022 వరకు ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో కాలమ్స్ రాశారు.

Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.