యాప్నగరం

YS Jaganను టార్గెట్ చేసిన మాజీ సీఎస్.. సీఎం మాట తప్పారా?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి టార్గెట్ చేశారు. ఎల్వీని తొలగించిన విధానం బాగోలేదని ఇటీవలే అభిప్రాయపడ్డ ఆయన.. తాజాగా రమణ దీక్షితులు విషయమై స్పందించారు.

Samayam Telugu 6 Nov 2019, 5:45 pm
వైఎస్ జగన్ సర్కారు టార్గెట్‌గా మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. రమణ దీక్షితులకు ఆగమ శాస్ర్త సలహామండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తూ మంగళవారం జగన్ సర్కారు జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తప్పించడం పట్ల బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బ్రాహ్మణులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపడం కోసం జగన్ సర్కారు రమణ దీక్షితులను తెరమీదకి తెచ్చిందనే వార్తలు కూడా వెలువడ్డాయి.
Samayam Telugu ysjagan


ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తొలగించడం పట్ల జగన్ సర్కారుపై తీవ్రంగా స్పందించిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు.. రమణ దీక్షితులు వ్యవహారంపైనా స్పందించారు. రమణ దీక్షితుల్ని ఆగమశాస్త్ర సలహా మండలి సభ్యుడిగా నియమిస్తూ... ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్వీట్ చేసిన ఐవైఆర్.. దీని భావం ఏంటని ప్రశ్నించారు. రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా వస్తున్నట్లా? రానట్లా? అని ఆయన ప్రశ్నించారు. ఆయన్ను ప్రధాన అర్చకులుగా నియమిస్తాయని జగన్ వాగ్దానం చేసిన విషయాన్ని ఐవైఆర్ గుర్తు చేశారు.
మరో ట్వీట్ చేసిన ఐవైఆర్.. కొందరు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ‘‘కోర్టు ఉత్తర్వులు దీక్షితులు గారికి అనుకూలంగా ఉంటే టీటీడీ దాని మీద అప్పీలు వేసింది. అది టీటీడీ వెనక్కి తీసుకోవచ్చు. ఎటువంటి స్టే ఉత్తర్వులు లేవు. కోర్టు తీర్పు కేవలం బహానా మాత్రమే’’ అని ఐవైఆర్ ట్వీట్ చేశారు. అంటే ఐవైఆర్ వ్యాఖ్యల ప్రకారం.. జగన్ ఇచ్చిన మాట తప్పారా?
Read Also: సీఎస్ బాధ్యతల నుంచి వైదొలిగాక.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక నిర్ణయం

Read Also: సీఎంల మెడకు ఉచ్చులా చుట్టుకుంటోంది.. ఎల్వీ బదిలీపై ఐవైఆర్ సంచలనం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.