యాప్నగరం

‘ఆ మంత్రి స్వరూపానందేంద్ర స్వామి శిష్యుడు.. అందుకే చర్యల్లేవ్’

మంత్రి అవంతి శ్రీనివాస్.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శిష్యుడని అందుకే కచ్చులూరు బోటు ప్రమాద ఘటనలో ఆయనపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు.

Samayam Telugu 3 Feb 2020, 11:48 pm
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా పుష్కరాల్లో 30 మంది చనిపోతే చంద్రబాబే ముద్దాయి అని జగన్ అన్నారని, మరి కచ్చులూరులో బోటు మునిగి 50 మంది చనిపోతే ముద్దాయి ఎవరని ప్రశ్నించారు. ఈ ఘటన సీఎం జగన్ బాధ్యుడు కాదా? అని నిలదీశారు. ఇదే విషయాన్ని తాను అడిగితే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu jagan

సోమవారం ఆయన ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయన వైసీపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కచ్చులూరు ఘటనలో అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనపై కేసులు పెట్టారని మండిపడ్డారు.

అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉన్న శాఖే పడవ ప్రమాదానికి బాధ్యత వహించాలన్నారు. అవంతి శ్రీనివాస్.. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శిష్యుడని, అందుకే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని చేశారని హర్షకుమార్ ఆరోపించారు. స్వరూపానందేంద్ర స్వామి శిష్యుడు కాబట్టే అవంతి శ్రీనివాస్‌పై సీఎం జగన్ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.