యాప్నగరం

దొంగతనం అంటగట్టి ఓనర్ వేధింపులు.. ఏలూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఇంట్లో బంగారు గొలుసు కనిపించడం లేదని పనిమనిషిని వేధించడంతో కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం. భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి ఆత్మహత్యకు యత్నించిన దారుణ ఘటన ఏపీలో జరిగింది.

Samayam Telugu 10 Jan 2020, 11:17 pm
గొలుసు దొంగతనం చేశావంటూ యజమాని వేధింపులకు గురిచేయడంతో ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. దొంగతనం అంటగట్టి హింసించడంతో తన భార్య, ఇద్దరు పిల్లలకు కూడా విషం తాగించి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
Samayam Telugu suicide 2


ఏలూరు మాజీ మేయర్ నూర్జహాన్ ఇంట్లో పనిచేసే పామర్తి రాంబాబు కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నం చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలకు కూడా విషమిచ్చి.. తాను కూడా విషం తాగాడు. తాను పనిచేస్తున్న ఇంట్లో బంగారు గొలుసు కనిపించడం లేదని.. తనపై దొంగతనం నేరం మోపి యజమాని హింసించారని రాంబాబు ఆరోపిస్తున్నాడు.

Also Read:
అమలాపురంలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం

దొంగతనం అంటగట్టడం.. యజమాని వేధింపులకు గురిచేయడంతో మనస్థాపానికి గురై కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేసినట్లు రాంబాబు చెబుతున్నారు. ప్రస్తుతం రాంబాబు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.